Pawan Kalyan: జనసేన యాగశాలను సందర్శించిన టాలీవుడ్ ప్రముఖులు... ఫొటోలు ఇవిగో!

Tollywood celebrities met Pawan Kalyan at Janasena office
  • మంగళగిరిలో పవన్ కల్యాణ్ ధర్మయాగం
  • పవన్ ను కలిసిన హరీశ్ శంకర్, దానయ్య, బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు
  • వారాహి వాహనం లోపలికి తీసుకెళ్లి చూపించిన పవన్
జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ధర్మయాగం, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, పవన్ ధర్మయాగం నిర్వహించిన యాగశాలను టాలీవుడ్ సినీ ప్రముఖులు సందర్శించారు. పవన్ కల్యాణ్ ను కలిసి ముచ్చటించారు. 

యాగశాలకు విచ్చేసినవారిలో దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, నిర్మాత డీవీవీ దానయ్య, సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, మైత్రీ మూవీస్ అధినేత రవిశంకర్, నిర్మాత వివేక్ కూచిభొట్ల ఉన్నారు. వీరంతా యాగశాలలో పూజల అనంతరం పవన్ తో సమావేశమయ్యారు. 

అక్కడే ఉన్న వారాహి వాహనం వివరాలను పవన్ ను అడిగి తెలుసుకున్నారు. వారిని పవన్ వారాహి వాహనం లోపలికి తీసుకెళ్లి చూపించారు. వారాహి వాహనం విజయాలను అందిస్తుందని, ఆ వాహనంపై సమరాన్ని ఆరంభించే సాహసి వస్తున్నాడని, ఆయనకు విజయాలు కలగాలని సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Pawan Kalyan
Celebrities
Tollywood
Varahi
Janasena

More Telugu News