Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి మరోసారి ఊరట!

HC extends Rahul Gandhis relief in Modi defamation case till Aug 2
  • 2019 ఎన్నికల సమయంలో మోదీ ఇంటి పేరుపై రాహుల్ వ్యాఖ్యల అంశం
  • కోర్టు హాజరు నుండి మినహాయింపుపై పొడిగింపు
  • ఆగస్ట్ 2 వరకు ప్రత్యక్ష హాజరు నుండి మినహాయింపును ఇచ్చిన న్యాయస్థానం
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరోసారి ఊరట లభించింది. కోర్టు హాజరు నుండి మినహాయింపును ఇస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బాంబే హైకోర్టు పొడిగించింది. ఆగస్ట్ 2 వరకు ప్రత్యక్ష హాజరు నుండి మినహాయింపును ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీకి చెందిన మహేశ్ 2021లో పరువు నష్టం కేసు వేశారు.

దీనిపై విచారణకు రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ గతంలో స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ రాహుల్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్వీ కొత్వాల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తాజాగా హాజరు మినహాయింపును న్యాయస్థానం మరోసారి పొడిగించింది.
Rahul Gandhi
Congress
Narendra Modi

More Telugu News