Pawan Kalyan: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పవన్ కల్యాణ్ భూమిపూజ

Pawan Kalyan laid foundation for Janasena party office building in Mangalagiri
  • ఇకపై మంగళగిరి నుంచే జనసేన పార్టీ కేంద్ర వ్యవహారాలు
  • అందులో భాగంగానే ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం
  • కార్యాలయ నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీర్లకు సూచించిన పవన్
మంగళగిరిలోని జనసేన కార్యాలయం ఇవాళ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. 

జనసేన పార్టీ కార్యక్రమాలు ఇప్పటివరకు హైదరాబాద్ నుంచే సాగుతున్నాయి. ఇక మీదట మంగళగిరి నుంచే పార్టీ కేంద్ర వ్యవహారాలు కొనసాగించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ నిపుణులకు పవన్ కల్యాణ్ సూచించారు. భూమి పూజ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. 

పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలో ధర్మయాగం కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో ఈ యాగం జరుపుతున్నారు. ఈ ధర్మయాగం రేపు కూడా కొనసాగనుంది.
Pawan Kalyan
Janasena
Office Building
Mangalagiri

More Telugu News