Stalin: మోదీపై అమిత్ షాకు కోపమెందుకో?: స్టాలిన్ వ్యంగ్యాస్త్రాలు

  • తమిళనాడుకు చెందిన వ్యక్తి ప్రధాని కావాలన్న అమిత్ షా వ్యాఖ్యలకు స్టాలిన్ కౌంటర్
  • షా సూచనను స్వాగతిస్తున్నానని వ్యాఖ్య
  • తమిళిసై, ఎల్.మురుగన్ కు అవకాశం వస్తుందని భావిస్తున్నానని ఎద్దేవా
why are you angry with pm modi stalins jibe at amit shah

బీజేపీ కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి ప్రధాని కావాలన్న అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘అమిత్ షా సూచనను నేను స్వాగతిస్తున్నా. కానీ ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీపై కోపమెందుకో నాకు అర్థం కావడం లేదు’’ అని ఎద్దేవా చేశారు. ప్రధానిగా మోదీ ఉండగా.. తమిళుడు ప్రధాని కావాలని ఎందుకు అంటున్నారనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ రోజు సేలంలో మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘తమిళ నేత ప్రధాని కావాలన్న ఆలోచన బీజేపీకి ఉంటే.. తమిళిసై (తెలంగాణ గవర్నర్) ఉన్నారు.. ఎల్.మురుగన్ (కేంద్ర మంత్రి) ఉన్నారు. వారికి ప్రధాన మంత్రి అభ్యర్థులుగా అవకాశం వస్తుందని భావిస్తున్నా’’ అని అన్నారు. తమిళ నేతలు ప్రధాని పదవిని చేపట్టకుండా డీఎంకే అడ్డుకుందంటూ బీజేపీ నేతలు చెప్పినట్లు వచ్చిన వార్తలపై స్పందించేందుకు స్టాలిన్ నిరాకరించారు. అమిత్ షా బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. తాను పూర్తి వివరణ ఇస్తానని చెప్పారు.

More Telugu News