Sensex: ఒక్కరోజులో ఇన్వెస్టర్ల సంపద రూ.1 లక్ష కోట్లు పెరిగింది!

  • లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • అంతర్జాతీయ మార్కెట్ నుండి సానుకూలతలు
  • మ్యాక్రో ఎకనమిక్ డేటా విడుదలకు ముందు సానుకూలంగా సూచీలు
Sensex Nifty snap two day losing run

స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. గతవారం చివరి రెండు రోజులు నష్టాలను నమోదు చేసిన సూచీలు ఈ వారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. కీలకమైన మ్యాక్రో ఎకనమిక్ డేటా, ఏప్రిల్ ఐఐపీ, మే నెల సీపీఐ విడుదలకు ముందు సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూలతలు ఉన్నప్పటికీ మ్యాక్రో ఎనకమిక్ డేటా విడుదల నేపథ్యంలో సూచీలు అప్రమత్తంగా కదలాడాయి.

మ్యాక్రో ఎకనమిక్ ఫిగర్స్ తో పాటు వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించనున్నాయి. అలాగే మే 13న అమెరికా ద్రవ్యోల్బణం డేటా, మే 14న యూఎస్ ఫెడ్ రిజర్వ్ మీటింగ్, మే 15న యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు మీటింగ్ వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సెన్సెక్స్ 99 పాయింట్లు లాభపడి 62,724 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు ఎగిసి 18,601 వద్ద ముగిసింది. మధ్యాహ్నం ఓ సమయంలో సెన్సెక్స్ 62,804 పాయింట్లను క్రాస్ చేసింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే రూ.1 లక్ష కోట్లు పెరిగింది.

More Telugu News