Sejal: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసిన యువతి శేజల్

Sejal complains CBI against BRS MLA Durgam Chinnaiyya
  • దుర్గం చిన్నయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న శేజల్
  • శేజల్ ఆరిజన్ డెయిరీ యజమాని
  • ఇటీవల ఢిల్లీలో తెలంగాణ భవన్ లో ఆత్మహత్యాయత్నం
  • తాజాగా సీబీఐని ఆశ్రయించిన వైనం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆయన అనుచరులు తనను అన్ని విధాలా వేధిస్తున్నారంటూ శేజల్ అనే యువతి ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. శేజల్ ఆరిజన్ డెయిరీ యజమాని. తాజాగా ఆమె ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చిన్నయ్య లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. దుర్గం చిన్నయ్యపై శేజల్ ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వేధింపులపై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని శేజల్ చెబుతున్నారు.
Sejal
Durgam Chinnayya
CBI
BRS MLA

More Telugu News