V Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు క్షీరాభిషేకం

minister srinivas goud felicitated by milk at mahabubnagar
  • మహబూబ్‌నగర్‌ పట్టణంలో శ్రీనివాస్ గౌడ్ కు సన్మానం
  • మహబూబ్‌నగర్ ను అభివృద్ధి చేస్తున్న నాయకుడంటూ ప్రశంసలు
  • శీనన్న నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అభిమానంతో ముంచెత్తారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని బీకేరెడ్డి కాలనీలో శ్రీనివాస్ గౌడ్ కు క్షీరాభిషేకం చేశారు. మహబూబ్‌నగర్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న నాయకుడంటూ ప్రశంసలు కురిపించారు. క్షీరాభిషేకం చేసి భుజాలపై మోశారు. ‘జై శీనన్న’.. ‘శీనన్న నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. 

అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీలో శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మంత్రి సమక్షంలో పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరారు.
V Srinivas Goud
mahabubnagar
felicitated by milk
BRS

More Telugu News