AAA Cinemas: అమీర్ పేటలో అల్లు అర్జున్ సినిమా థియేటర్... ఓపెనింగ్ కు ముహూర్తం ఖరారు

  • అమీర్ పేట సత్యం థియేటర్ స్థానంలో భారీ మల్టీప్లెక్స్
  • ఏషియన్ సినిమాస్ తో కలిసి నిర్మించిన అల్లు అర్జున్
  • జూన్ 15న ప్రారంభించనున్న మంత్రి తలసాని
Allu Arjun multiplex soon to be launched

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ సంస్థ, మరికొందరు భాగస్వాములతో కలిసి హైదరాబాద్ అమీర్ పేటలో నిర్మించిన భారీ మల్టీ ప్లెక్స్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ కూడా హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు రోజు జూన్ 14న పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

సినిమా ప్రియులను దశాబ్దాల తరబడి అలరించిన అమీర్ పేట సత్యం థియేటర్ స్థానంలో ఈ అత్యాధునిక మల్టీప్లెక్స్ ను నిర్మించారు. ఈ మల్టీప్లెక్స్ కు ఏషియన్ సత్యం మాల్ అండ్ మల్టీప్లెక్స్ గా నామకరణం చేశారు. ఇందులోని 4వ అంతస్తులో అల్లు అర్జున్ పేరు, ఏషియన్ సినిమాస్ పేరు వచ్చేలా AAA పేరిట వివిధ స్క్రీన్లతో థియేటర్లు ఉన్నాయి. బార్కో లేజర్ ప్రొడక్షన్, 4కే ప్రొజెక్షన్, డాల్బీ అట్మోస్, ఎపిక్ లక్జాన్ స్క్రీన్ ఈ థియేటర్ల ప్రత్యేకతలు. 

అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లో ఫుడ్ కోర్ట్ ను ఆకర్షణీయంగా రూపొందించారు. కృతుంగా, పిస్తా హౌస్, హల్దీ రామ్, ఫస్ట్ పాపైజ్ చికెన్ అవుట్ లెట్స్ ను ఈ ఫుడ్ కోర్టులో ఏర్పాటు చేశారు. 

ఈ మల్టీప్లెక్స్ లో అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ లతో పాటు మురళీమోహన్, సదానంద్ గౌడ్ కూడా భాగస్వాములని తెలుస్తోంది.

More Telugu News