China: దేశంలో ఉన్న చివరి ఇండియన్ జర్నలిస్టును కూడా వెళ్లిపోవాలని చైనా ఆదేశం

China orders last Indian journalist to leave their country
  • భారత్, చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు
  • ఏప్రిల్ లో చైనా నుంచి వచ్చిన ముగ్గురు జర్నలిస్టులు
  • ప్రస్తుతం చైనాలో ఒకేఒక ఇండియన్ జర్నలిస్ట్
భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భారతీయ జర్నలిస్టులను చైనా పంపించేస్తోంది. మన జర్నలిస్టుల వీసాలను కూడా రెన్యువల్ చేయడం లేదు. ఏప్రిల్ లో హిందూ న్యూస్ పేపర్, ప్రసారభారతి, హిందుస్థాన్ టైమ్స్ రిపోర్టర్ల వీసాలను రెన్యువల్ చేయలేదు. దీంతో వీరు ఇండియాకు తిరిగొచ్చారు. 

మరోవైపు చైనాలో ఉన్ని చివరి భారతీయ జర్నలిస్టు, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ ను ఈ నెలాఖరులోగా చైనాను వీడి పోవాలని ఆదేశించింది. ఇంకోవైపు దీనిపై స్పందించేందుకు చైనా విదేశాంగ శాఖ నిరాకరించింది. 

ఇదిలావుంచితే, ఈ నెల ప్రారంభంలో భారత అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ మన దేశంలో చైనా జర్నలిస్టులు స్వేచ్ఛగా పని చేసుకుంటున్నారని... కానీ, చైనాలో మనవాళ్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. 
China
Indian
Journalist

More Telugu News