Andhra Pradesh: వేతనాలు ఇవ్వడం లేదని ఏపీ మంత్రి ఛాంబర్‌‌కు తాళమేసిన ఉద్యోగులు

Employees locked AP minister chamber for not getting salaries
  • ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని సచివాలయ ఉద్యోగుల ఆవేదన
  • విధులకు గైర్హాజరైన ఉద్యోగులు
  • మంత్రి ఛాంబర్ కు తాళం వేసి ఉద్యోగుల నిరసన
  • వేతనాలు చెల్లించే వరకు ఛాంబర్ తాళం తెరిచేది లేదని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ మంత్రి వేణుగోపాలకృష్ణకు ఉద్యోగుల నుండి షాక్ ఎదురైంది. ఎనిమిది నెలలుగా వేతనాలను చెల్లించడం లేదంటూ సచివాలయ ఉద్యోగులు విధులకు గైర్హాజరయ్యారు. 2022 నవంబర్ నుండి వేతనాలు రావడం లేదంటూ సచివాలయంలోని ఆయన ఛాంబర్ కు తాళం వేసి నిరసన తెలిపారు. మంత్రి, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పూర్తి వేతనాలు చెల్లించే వరకు మంత్రి ఛాంబర్ తాళం తెరిచేది లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News