Covin App: కోవిన్ యాప్ డేటా లీక్.. లీకైన వారిలో కేటీఆర్, కనిమొళి

Data leaked in Covin App
  • టెలిగ్రామ్ లో కోవిడ్ డేటా లీక్
  • కరోనా సమయంలో వ్యాక్సిన్ కోసం రూపొందిన కోవిన్ యాప్
  • ఆధార్, ఫోన్ నెంబర్, పాస్ పోర్ట్ తదితర వివరాల లీక్
కరోనా సమయంలో వ్యాక్సిన్ కు సంబంధించి కోవిన్ యాప్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ యాప్ నుంచి భారీ ఎత్తున డేటా లీక్ అయింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లో భారతీయల ఆధార్, పాస్ పోర్ట్ వివరాలు, వ్యక్తిగత సమాచారం లీక్ అయింది. డేటా లీక్ అయిన బాధితుల్లో కేటీఆర్, కనిమొళి, పి.చిదంబరం, జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్ తదితర ప్రముఖులు ఉన్నారు. వ్యక్తుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఆధార్ తదితర వివరాలు టెలిగ్రామ్ లో ప్రత్యక్షమయ్యాయి. ఎంతో గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారం లీక్ కావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Covin App
Data Leak

More Telugu News