Gopichand: గోపీచంద్ 31వ సినిమా టైటిల్ ఇదే .. ఆసక్తిని రేపుతున్న ఫస్టులుక్!

  • రాధామోహన్ నిర్మాణంలో గోపీచంద్ మూవీ 
  • కెరియర్ పరంగా ఇది ఆయనకి 31వ సినిమా
  • యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో సాగే కథ 
  • సంగీతాన్ని సమకూర్చుతున్న రవి బస్రూర్
Gopichand New Movie Update

గోపీచంద్ కి ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. అయినా తన ప్రయత్నం తాను చేస్తూ ముందుకు వెళుతున్నాడు. అయినా సక్సెస్ అనేది ఆయనతో దోబూచులాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తనకి అచ్చొచ్చిన యాక్షన్ రూట్లోనే మరో సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. 

అలా ఆయన చేస్తున్న సినిమా సెట్స్ పైకి వెళ్లింది. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. కెరియర్ పరంగా గోపీచంద్ కి ఇది 31వ సినిమా. ఇంతవరకూ ఈ సినిమా టైటిల్ ను గోప్యంగా ఉంచుతూ వచ్చారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను .. ఫస్టు లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'భీమా' అనే టైటిల్ ను ఖరారు చేశారు .. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ ఫస్టులుక్ ను వదిలారు. డిఫరెంట్ మీసకట్టుతో ఈ సినిమాలో ఆయన కనిపించనున్నాడు.   

మొదటి నుంచి కూడా గోపీచంద్ యాక్షన్ హీరోగానే ఎక్కువ మార్కులు కొట్టేస్తూ వచ్చాడు. ఆ తరువాత ఫ్యామిలీ హీరోగా నిరూపించుకున్నప్పటికీ, ఆ తరహా కథల్లోను యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లోనే కొనసాగనుంది. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

More Telugu News