Hyderabad: కొండెక్కిన చికెన్ ధర.. రేటు ఎప్పుడు తగ్గుతుందనే ప్రశ్నకు చికెన్ వ్యాపారుల సమాధానం ఇదే!

  • ఆదివారం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 290 - 310
  • ఎండలతో కోళ్లు చనిపోతున్నాయన్న వ్యాపారులు
  • పూర్తి స్థాయిలో వర్షాలు పడితే ధరలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని వివరణ
When chicken rate in Hyderabad comes down

హైదరాబాద్ లో చికెన్ ధరలు మండిపోతున్నాయి. వారం క్రితం స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ. 240 నుంచి 260 మధ్యలో ఉండగా... లైవ్ కోడి రూ. 140 నుంచి 160 మధ్య ఉండేది. ఈ ఆదివారం కేజీ ధర ఏకంగా రూ. 100 నుంచి 120 వరకు పెరిగింది. స్కిన్ లెస్ చికెన్ హోల్ సేల్ లో కిలో రూ. 290 నుంచి రూ. 310 వరకు అమ్మారు. రీటెయిల్ లో రూ. 320 నుంచి 340 వరకు కూడా విక్రయించారు. నాటుకోడి ధర కిలో రూ. 380 నుంచి 400 వరకు ఉంది. 

ఈ ధరలతో సామాన్యుడు షాక్ కు గురయ్యాడు. విపరీతంగా పెరిగిన ధరలతో చికెన్ అమ్మకాలు కూడా 40 శాతం వరకు పడిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు పెరిగిన ధరలపై చికెన్ వ్యాపారులు స్పందిస్తూ... పెరిగిన ఎండలతో కోళ్లు చనిపోతున్నాయని, కోళ్ల కొరత ఏర్పడటంతో ధరలు పెరిగాయని చెపుతున్నారు. మరో నాలుగు, ఐదు రోజుల వరకు ధరలు తగ్గకపోవచ్చని... వర్షాలు పూర్తి స్థాయిలో పడితే ధరలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని తెలిపారు.

More Telugu News