భక్తులపై పోలీసుల లాఠీచార్జ్.. రగులుతున్న మహారాష్ట్ర.. వీడియో ఇదిగో!
- వార్కారీ భక్తులపై లాఠీచార్జి దృశ్యాలు వైరల్
- ఔరంగజేబు దీనికి భిన్నంగా ఏమీ ప్రవర్తించలేదన్న సంజయ్ రౌత్
- మహారాష్ట్రలోకి మొఘలులు మళ్లీ వచ్చారని ఎద్దేవా
- హిందుత్వ ప్రభుత్వం ముసుగు తొలగిపోయిందని వ్యాఖ్య
పోలీసులు మాత్రం దూసుకొస్తున్న భక్తులను అదుపు చేసేందుకు తాము స్వల్పంగా లాఠీచార్జ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు 75 మందికి మాత్రమే అనుమతి ఉండగా 400 మంది బలవంతంగా చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారని, అందుకనే లాఠీచార్జ్ చేసినట్టు వివరించారు. అది లాఠీ చార్జి కాదని, చిన్నపాటి గొడవ మాత్రమేనని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. వార్కారీలపై లాఠీచార్జ్ జరగలేదని స్పష్టం చేశారు. భక్తులు బారికేడ్లను విరగ్గొట్టడంతో పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారని వివరించారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారని పేర్కొన్నారు.
వార్కారీ భక్తులపై జరిగిన దాడిపై శివసేన సీనియర్ ఎంపీ సంజీవ్ రౌత్ మండిపడ్డారు. హిందుత్వ ప్రభుత్వం ముసుగు తొలగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔరంగజేబు కూడా దీనికి భిన్నంగా ప్రవర్తించలేదని అన్నారు. మహారాష్ట్రలోకి తిరిగి ముస్లింలు వచ్చేశారని విమర్శించారు. భక్తులపై దాడిని ఎన్సీపీ నేత చగన్ భుజ్బల్ కూడా ఖండించారు.