Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్

  • బైక్ ను తప్పించే క్రమంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు
  • రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొన్న కారు
  • ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో కౌశిక్ రెడ్డికి తప్పిన ప్రమాదం
BRS MLC Kaushik Reddy car met with accident

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయే క్రమంలో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో కౌశిక్ రెడ్డి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. శంకరపట్నం మండలం తాడికల్ శివారులో ఈ ప్రమాదం జరగింది. గాయపడ్డ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News