Pawan Kalyan: వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ బహిరంగ సభల షెడ్యూల్ విడుదల

- ఈ నెల 14 నుంచి పవన్ వారాహి యాత్ర
- ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర తొలిదశ
- 11 నియోజకవర్గాల మీదుగా యాత్ర
- కత్తిపూడిలో తొలి సభ
జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల సమర శంఖారావం పూరిస్తూ ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వారాహి వాహనానికి పూజలు జరిపించిన అనంతరం పవన్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
కాగా, వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్ ను జనసేన పార్టీ నేడు విడుదల చేసింది. జూన్ 14న కత్తిపూడిలో తొలి సభ నిర్వహిస్తారు. తొలి దశలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర తొలి దశ ఉంటుంది.
జూన్ 16- పిఠాపురంలో వారాహి యాత్ర, సభ
జూన్ 18- కాకినాడలో వారాహి యాత్ర, సభ
జూన్ 20- ముమ్మిడివరంలో వారాహి యాత్ర, సభ
జూన్ 21- అమలాపురంలో వారాహి యాత్ర, సభ
జూన్ 22- పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర, మలికిపురంలో సభ
జూన్ 23- నరసాపురంలో వారాహి యాత్ర, సభ