Daggubati Purandeswari: అరాచక పాలన వల్లే ఏపీకి పెట్టుబడులు రావడంలేదు: పురందేశ్వరి

  • ఏపీలో వైసీపీ, బీజేపీ నేతల మాటల యుద్ధం
  • నిన్న శ్రీకాళహస్తి సభలో ఏపీ సర్కారుపై నడ్డా విమర్శలు
  • మండిపడిన వైసీపీ నేతలు... నడ్డాపై ఎదురుదాడి
  • వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తున్న బీజేపీ అగ్రనేతలు
Purandeswari comments on AP govt

వైసీపీ నేతలకు, బీజేపీ నాయకులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై వైసీపీ నేతలు ధ్వజమెత్తగా, బీజేపీ నేతలు కూడా దీటుగా బదులిస్తున్నారు. అరాచక పాలన వల్లే ఏపీకి పెట్టుబడులు రావడంలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి విమర్శించారు. ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఏపీ నుంచి పారిపోతున్నారని వెల్లడించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించింది ఎవరో జగన్ చెప్పాలని నిలదీశారు. 

ఏపీకి 25 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని... ఇంటి స్థలాలు, ఇళ్లు ఎందరికి ఇచ్చారో శ్వేతపత్రం ఇవ్వాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. పేదల వద్ద డబ్బు తీసుకుని స్థలాలకు పట్టాలు ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. 

కేంద్రం ఇచ్చే బియ్యంపైనా జగన్ ఫొటోలు దారుణమని విమర్శించారు. ప్రజలకు మేలు చేయాలనే దిశగానే పాలన జరగాలని పురందేశ్వరి హితవు పలికారు.

More Telugu News