బాలకృష్ణ తనయుడు ఎలా మారిపోయాడో చూడండి!
- గతంలో బొద్దుగా కనిపించిన నందమూరి మోక్షజ్ఞ
- ఇప్పుడు గుర్తుపట్టలేనంత నాజూకుగా బాలయ్య వారసుడు
- త్వరలో సినీ అరంగేట్రం అంటూ వార్తలు
అయితే, తాజాగా సోషల్ మీడియాలో మోక్షజ్ఞ ఫొటోలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అందరికీ తెలిసిన మోక్షజ్ఞ బొద్దుగా ఉంటాడు... కానీ ఈ కొత్త మోక్షజ్ఞ స్లిమ్ లో అదరగొడుతున్నాడు. అతడే మోక్షజ్ఞ అని చెబితే తప్ప గుర్తుపట్టలేనంత నాజూగ్గా తయారయ్యాడు.
త్వరలోనే బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ ఉండొచ్చని, అందుకే ఈ వెయిట్ లాస్ అని ప్రచారం జరుగుతోంది. గతంలో బాలకృష్ణ-సింగీతం కాంబోలో వచ్చిన ఆదిత్య 369 ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ లో మోక్షజ్ఞే హీరో అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
