Cyclone Biparjoy: అతి తీవ్ర తుపానుగా మారిన బిపర్‌జోయ్.. 15న తీరానికి!

  • అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన ‘బిపర్‌జోయ్’
  • మాండ్వీ-కరాచీ మధ్య తీరం దాటనున్న తుపాను
  • గంటకు గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు
Cyclone Biparjoy intensifies into extremely severe cyclonic storm

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది.  సౌరాష్ట్ర-కచ్, దానిని ఆనుకుని ఉన్న పాకిస్థాన్ తీరాల్లో ఈ నెల 15న మధ్యాహ్నం అది తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఇది తూర్పు మధ్య అరేబియా సముద్రంలో పోర్‌బందర్‌కు దక్షిణ-నైరుతికి 480 కిలోమీటర్ల దూరంలో, ద్వారకకు దక్షిణ-నైరుతిగా 530 కిలోమీటర్ల దూరంలో, కచ్‌లోని నలియాకు దక్షిణ-నైరుతికి 610 కిలోమీటర్ల దూరంలో, పాకిస్థాన్‌లోని కరాచీకి దక్షిణాన 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  

జూన్ 14 వరకు ఇది ఉత్తరం వైపుగా కదిలే అవకాశం ఉందని, ఆ తర్వాత ఉత్తరం-ఈశాన్యం దిశగా కదులుతూ సౌరాష్ట్ర, కచ్..  దానికి ఆనుకుని ఉన్న మాండ్వీ (గుజరాత్), కరాచీ (పాకిస్థాన్) మధ్య పాకిస్థాన్ తీరాలను దాటి 15న మధ్యాహ్నం అత్యంత తీవ్ర తుపానుగా మారుతుందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

More Telugu News