Rahul Dravid: ద్రావిడ్ కు నేను పెద్ద అభిమానిని.. కానీ అందులో మాత్రం ద్రావిడ్ జీరో: పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ

Pakistan Ex Cricketer Basit Ali comments on Dravid
  • క్రికెటర్ గా ద్రావిడ్ చాలా గ్రేట్ అన్న బాసిత్ అలీ
  • కోచ్ గా చేసిందేమీ లేదని వ్యాఖ్య
  • భారత జట్టును ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదని విమర్శ
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ మాట్లాడుతూ ద్రావిడ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. క్రికెటర్ గా ద్రావిడ్ చాలా గ్రేట్ అని, ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. అయితే కోచ్ గా టీమ్ కు చేసిందేమీ లేదని అన్నారు. ద్రావిడ్ కు తాను చాలా పెద్ద అభిమానినని, ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పానని తెలిపారు. కోచ్ గా మాత్రం ద్రావిడ్ జీరో అని స్పష్టం చేశారు. భారత జట్టును ద్రావిడ్ ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదని అన్నారు.

Rahul Dravid
Team India
Basit ALI
Pakistan

More Telugu News