Sharad Pawar: శరద్ పవార్ కు బెదిరింపు సందేశాలు పంపించింది ఎవరంటే..!

  • బీజేపీ కార్యకర్తగా చెప్పుకుంటున్న సౌరబ్ పింపాల్కర్ నుండి ఈ బెదిరింపులు!
  • బెదిరింపు సందేశం తర్వాత పరారీలో సౌరబ్
  • దర్యాఫ్తు సంస్థలు ఈ బెదిరింపును తీవ్రంగా పరిగణించాలన్న అజిత్ పవార్
Man who gave death threat to Sharad Pawar is a BJP worker says Ajit Pawar

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కు ఇటీవల హత్య బెదిరింపులు రావడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పవార్ కు బెదిరింపులపై ఆ పార్టీ నేత, ఎంపీ సుప్రియా సూలే ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కూడా విచారణకు ఆదేశించారు. ఈ బెదిరింపు సందేశాలను అమరావతికి చెందిన బీజేపీ కార్యకర్త సౌరబ్ పింపాల్కర్ పంపినట్లుగా విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి.

సౌరబ్ తన ట్విట్టర్ ఖాతాలో బీజేపీ కార్యకర్తగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించవలసి ఉంది. మరోవైపు, ఈ బెదిరింపు సందేశం తర్వాత సౌరబ్ పరారీలో ఉన్నాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే సౌరబ్ అమరావతి యూనివర్సిటీ లా పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సహ నిందితుడిగా ఉన్నాడు. పవార్ కు బెదిరింపు వచ్చిన కేసులో నిందితుడు బీజేపీ కార్యకర్తగా తెలుస్తోందని, దీనిని దర్యాఫ్తు సంస్థలు తీవ్రంగా పరిగణించాలని, అతడి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరో బయటపెట్టాలని ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిమాండ్ చేశారు.

More Telugu News