బెయిల్ వచ్చిన తర్వాత రెండో సారి సీబీఐ విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి
- మధ్యంతర బెయిల్ పై ఉన్న అవినాశ్ రెడ్డి
- ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని టీఎస్ హైకోర్టు షరతు
- ఐదుగురు అధికారులు అవినాశ్ ను విచారిస్తున్నట్టు సమాచారం
ముందస్తు బెయిల్ పొందిన తర్వాత సీబీఐ విచారణకు అవినాశ్ హాజరు కావడం ఇది రెండో సారి. ఐదుగురు అధికారులు అవినాశ్ ను విచారిస్తున్నట్టు సమాచారం. హత్య జరిగిన రోజు అర్ధరాత్రి మాట్లాడిన వాట్సాప్ కాల్స్ పైనే అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.