Balakrishna: బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, నారా లోకేశ్, కల్యాణ్ రామ్

Chandrababu birthday greetings to Balakrishna
  • నేడు బాలకృష్ణ పుట్టినరోజు
  • నిండు నూరేళ్లు ఆనందంతో, ఆరోగ్యంతో ఉండాలన్న చంద్రబాబు
  • బాలా మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ లోకేశ్ ట్వీట్
  • హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ కల్యాణ్ రామ్ గ్రీటింగ్స్
టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినం నేడు. ఈ సందర్భంగా బాలయ్యకు సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆయనకు గ్రీటింగ్స్ తెలిపారు. 'నటునిగా కళాసేవ... ఎమ్మెల్యేగా ప్రజాసేవ... ఆసుపత్రి నిర్వహణతో సమాజ సేవ చేస్తున్న మా బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మంచి మనసుతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న మీరు... నిండు నూరేళ్లూ ఆనందంతో, ఆరోగ్యంతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు. 

తన మేనమామకు టీడీపీ యువనేత నారా లోకేశ్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రియమైన బాలా మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. కుటుంబంలో ఎప్పుడూ ప్రియమైన వ్యక్తిగా ఉన్నందుకు ధన్యవాదాలు అని అన్నారు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. 

సినీ హీరో నందమూరి కల్యాణ్ రామ్ కూడా గ్రీటింగ్స్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పడే 'భగవంత్ కేసరి' టీజర్ చూశానని... ఎప్పటిలాగే ఫెరోషియస్ గా ఉన్నారని అన్నారు.
Balakrishna
Chandrababu
Nara Lokesh
Kalyanram
Telugudesam

More Telugu News