Biparjoy: ఉగ్రరూపం దాలుస్తున్న బిపర్ జోయ్ తుపాను.. పలు రాష్ట్రాలకు అలర్ట్.. బిపర్ జోయ్ అంటే అర్థం ఏమిటంటే!

  • మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతున్న బిపర్ జోయ్
  • గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు
  • బిపర్ జోయ్ అంటే విపత్తు అని అర్థం
Meaning of cyclone Biparjoy

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతోందని ఈ ఉదయం కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా తుపాను కదులుతోందని తెలిపింది. తుపాను కేంద్రీకృతమైన ప్రాంతంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్, గుజరాత్, కేరళ రాష్ట్రాలకు ఐఎండీ అలెర్ట్ ప్రకటించింది. తీవ్ర తుపాను కారణంతో ఈ కోస్టల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 

మరోవైపు తుపాను నేపథ్యంలో గుజరాత్ లోని ప్రఖ్యాత టూరిస్ట్ డెస్టినేషన్ అయిన వల్సాద్ లోని తిథాల్ బీచ్ ను ఈ నెల 14 వరకు మూసి వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని... సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని తెలిపారు. మరోవైపు, వార్నింగ్ సిగ్నల్ ఇవ్వాలని పశ్చిమ తీరంలోని అన్ని పోర్టులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

బిపర్ జోయ్ అంటే అర్థం ఏమిటంటే?
ప్రతి తుపానుకు ఒక పేరు పెట్టడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు బిపర్ జోయ్ అనే పేరు పెట్టారు. ఇది బంగ్లాదేశ్ సూచించిన పేరు. విపత్తు అని దీని అర్థం.

More Telugu News