Sumbul Touqeer: తండ్రికి మళ్లీ పెళ్లి చేస్తున్న బిగ్‌బాస్ 16 ఫేమ్ నటి సంబుల్

Sumbul Touqeer Confirms Her Father To Get Married Again
  • తండ్రికి మళ్లీ జీవితాన్ని ఇవ్వాలని భావించిన నటి
  • సోదరి, పెదనాన్నతో కలిసి తండ్రిని ఒప్పించిన వైనం
  • వచ్చే వారమే వివాహం
బిగ్‌బాస్ 16 ఫేమ్ నటి సంబుల్ తౌఖీర్ ఖాన్ తండ్రి మళ్లీ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని నటి స్వయంగా వెల్లడించింది. ఒంటరిగా తమను పెంచి పెద్ద చేసిన తండ్రికి మళ్లీ జీవితాన్ని ఇవ్వాలని భావించిన సంబుల్, సోదరి సానియా కలిసి తమ పెదనాన్న సాయంతో తౌఖీర్‌ఖాన్‌ను ఒప్పించారు. వచ్చే వారమే ఆయన వివాహం జరగనుంది. 

కొన్నేళ్లుగా తండ్రే తమకు సర్వస్వంగా మారారని, ఆయనే తమకు స్ఫూర్తి అని సంబుల్ పేర్కొన్నారు. తండ్రిని ఒప్పించే విషయంలో పెదనాన్న ఇక్బాల్ హుసైన్ ఖాన్ పోషించిన పాత్ర ఎనలేనిదని, ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు. సంబుల్ తండ్రి తౌఖీర్ ఖాన్ త్వరలో నిలోఫర్‌ను పెళ్లాడబోతున్నారు. ఆమెకు అంతకుముందే వివాహమై భర్తతో విడిపోయారు. తొలి భర్త నుంచి ఆమెకు ఇజ్రా అనే కుమార్తె ఉంది.
Sumbul Touqeer
Bigg Boss 16
Touqeer Khan
Bollywood

More Telugu News