Telugudesam: ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు

TDP complaints against YCP on attacks in ap
  • గవర్నర్ ను కలిసి మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
  • ఎన్నడూ లేని విధంగా బలహీనవర్గాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణ
  • దాడుల అంశంపై కమిటీ వేసి విచారణ చేపట్టాలని గవర్నర్ ను కోరిన టీడీపీ

రాష్ట్రంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, మాజీ మంత్రులు ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర తదితరులు గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. గవర్నర్ ను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, గతంలో ఎన్నడులేని విధంగా బలహీనవర్గాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాయలసీమలో మైనార్టీలపై దాడుల అంశాన్ని గవర్నర్ కు వివరించినట్లు చెప్పారు. దాడుల అంశంపై కమిటీ వేసి విచారణ చేపట్టాలని కోరినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News