Chandrababu: చంద్రబాబు గొప్ప నాయకుడు.. ప్రశంసించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

AP BJP Chief Somu Veerraju Praised Chandrababu
  • నడ్డా, అమిత్ షాను చంద్రబాబు ఎందుకు కలిశారో ఆయననే వెళ్లి అడగమన్న వీర్రాజు
  • పార్టీ పెద్దల్ని ఎవరైనా కలవొచ్చన్న ఏపీ బీజేపీ చీఫ్
  • దేవానంద్‌ విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని వ్యాఖ్య

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రశంసలు కురిపించారు. ఆయన గొప్ప నేత అని కొనియాడారు. చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో బీజేపీ చీఫ్ నడ్డా,  హోం మంత్రి అమిత్ షాలను కలవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు వీర్రాజు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. వారిద్దరినీ చంద్రబాబు ఎందుకు కలిశారో ఆయననే అడగాలన్న వీర్రాజు.. చంద్రబాబు గొప్ప నాయకుడని, తాను వెళ్లి ఆయనను కలవలేదని, అలాగని ఆయన అమిత్ షాను కలవడాన్ని తాను వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు. 

పార్టీ పెద్దల్ని ఎవరైనా కలవొచ్చన్నారు. రాష్ట్రంలోని ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవానంద్ ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్టు  వస్తున్న ఆరోపణలపై వీర్రాజు మాట్లాడుతూ.. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లిందని, దీనిని వారే చూసుకుంటారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News