Viral Pics: చాట్‌జీపీటీతో టీచర్‌ను బురిడి కొట్టించబోయిన 7వ తరగతి స్టూడెంట్!

  • చాట్‌జీపీటీ సాయంతో 7వ తరగతి విద్యార్థి హోం వర్క్
  • చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం యథాతథంగా కాపీ
  • ఏఐ మోడల్‌గా తనకు వ్యక్తిగత అభిప్రాయం ఉండదన్న వాక్యం కూడా రాసేసిన విద్యార్థి
  • చివరకు టీచర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వైనం
  • తన మేనల్లుడి తప్పును సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్
7class student takes help of chatgpt in homework gets caught in hilarious way

చాట్‌జీపీటీతో టీచర్‌ను బురిడీ కొట్టించబోయిన 7వ తరగతి విద్యార్థి చివరకు అడ్డంగా దొరికిపోయాడు. తన మేనల్లుడు ఎలా బుక్కయ్యాడో చెబుతూ ఓ నెటిజన్ నెట్టింట షేర్ చేసిన కథనం ప్రస్తుతం వైరల్‌గా మారింది. టీచర్ ఇచ్చిన హోం వర్క్‌ను ఆ విద్యార్థి చాట్‌జీపీటీ సాయంతో పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఓ ప్రశ్నకు చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానాన్ని యథాతథంగా తన హోం వర్క్‌లో రాసుకొచ్చాడు. 

‘ఓ లాంగ్వేజ్ మోడల్‌గా, నాకు వ్యక్తిగత అంచనాలు లేదా అభిప్రాయాలు ఉండవు’ అన్న చాట్‌జీపీటీ మాటలను కూడా తన హోం వర్క్‌లో రాసేశాడు. దీంతో, సమాధాన పత్రంలోని ఆ వ్యాక్యాన్ని టీచర్ హైలైట్ చేసింది. దాని తాలూకు స్క్రీన్‌షాట్‌ను ఓ నెటిజన్ నెట్టింట పెట్టడంతో అది తెగ వైరల్ అవుతోంది. కుర్రాడి పొరపాటు చూసి నెటిజన్లు పడిపడీ నవ్వుకుంటున్నారు.

More Telugu News