Kalaya Nijama: సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’ నుంచి ‘కలయా నిజమా’ లిరికల్ సాంగ్ రిలీజ్

Kalaya Nijama lyrical song from Calling Sahasra movie out now
  • సుడిగాలి సుధీర్, డోలిశ్య జంటగా కొత్త చిత్రం
  • అరుణ్ విక్కిరాలా దర్శకత్వం
  • మోహిత్ రెహమానిక్ సంగీతం
  • కలయా నిజమా పాటకు లక్ష్మీ ప్రియాంక లిరిక్స్
  • అద్భుతంగా ఆలపించిన సీనియర్ గాయని చిత్ర
అటు బుల్లి తెర ఇటు సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ సుడిగాలి సుధీర్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు క‌టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డోలిశ్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

ఈ చిత్రం నుంచి తాజాగా ‘కలయా నిజమా...’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మోహిత్ రెహ‌మానిక్‌ సంగీతం అందించిన ఈ పాట‌ను ల‌క్ష్మీ ప్రియాంక రాశారు. ప్ర‌ముఖ సింగ‌ర్ కె.చిత్ర ఈ పాట‌ను పాడారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ‘‘సహస్ర కాలింగ్’ చిత్రం నుంచి ‘కలయా నిజమా...’ లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేశాం. లెజెండ్రీ సింగ‌ర్‌ చిత్ర‌గారు అద్భుతంగా పాడారు. మోహిత్ రెహ‌మానిక్‌ అందించిన ట్యూన్‌, దానికి ల‌క్ష్మీ ప్రియాంకగారు రాసిన లిరిక్స్ బ్యూటీఫుల్‌గా కుదిరాయి. సుడిగాలి సుధీర్‌, డోలిశ్య మ‌ధ్య కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంటుంది. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.
Kalaya Nijama
Lyrical Song
Calling Sahasra
Sudigali Sudheer
Dolisya
Tollywood

More Telugu News