ఈ ప్రాంతాన్ని కోనసీమగా మారుస్తాం: మంత్రి హరీశ్ రావు
- సంగమేశ్వర ఎత్తిపోతలను రెండేళ్లలో పూర్తి చేస్తామన్న మంత్రి
- ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని, రెండు పంటలు పండుతాయని వెల్లడి
- కేసీఆర్ సీఎం కావడం వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందని వ్యాఖ్య
సింగూర్ నీళ్లు ఇక్కడి ప్రజల సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకే ఉపయోగపడేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇవ్వడంతో పాటు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఆసుపత్రులను అభివృద్ధి చేశామన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇస్తున్నామని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నామన్నారు. పండించిన ధాన్యం కొనుగోలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందరూ ఆదరించాలన్నారు. ఈ ప్రాంతాన్ని కోనసీమగా మారుస్తామన్నారు.