new york: కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అయిన న్యూయార్క్

new york air quality worsens canada wildfire

  • ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 222 నమోదు
  • ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయి
  • కెనడా అడవుల్లో కార్చిచ్చు ప్రభావం
  • కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి
  • డెట్రాయిట్ వాసులకూ ఇబ్బందే

న్యూయార్క్ వాసులు మంగళవారం కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. సాయంత్రం అయ్యే సరికి నగరం మొత్తాన్ని కాలుష్య పొగ కప్పేసింది. కెనడాలో కార్చిచ్చు ప్రభావం న్యూయార్క్ నగరాన్ని తాకడమే ఈ పరిస్థితికి దారితీసింది. యూఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 222ను తాకింది. ఇది ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయి అని అర్థం. మన దేశంలోని ఢిల్లీ, ఇరాక్ లోని బాగ్ధాద్ తదితర నగరాలతో పోల్చినా అధిక కాలుష్య స్థాయి న్యూయార్క్ లో కనిపించింది. 

ఈ కార్చిచ్చు ప్రభావంతో ఉత్తర అమెరికా పట్టణాలు సైతం ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా డెట్రాయిట్ వాసులు కూడా ఇబ్బంది పడ్డారు. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ స్పందిస్తూ.. వాయు నాణ్యతపై తాము సూచన జారీ చేసినట్టు చెప్పారు. బుధవారం ఉదయానికి వాతావరణం కొంత మెరుగుపడొచ్చని, తిరిగి సాయంత్రానికి మళ్లీ కాలుష్యం పెరిగిపోవచ్చన్నారు. 

న్యూయార్క్ వాసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందస్తు చర్యలు చేపడతామని ఆడమ్స్ ప్రకటించారు. వీలైనంత వరకు బయటికొచ్చే పనులను తగ్గించుకోవాలని న్యూయార్క్ వాసులను ఆయన కోరారు. ఇప్పటి వరకు కెనడా అడవుల్లో 8.2 మిలియన్ ఎకరాల పరిధిలో చెట్లు తగలబడినట్టు సమాచారం. 26,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కార్చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది.

  • Loading...

More Telugu News