2018 movie: సర్‌‌ప్రైజ్.. థియేటర్లో ఉండగానే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ చిత్రం

  • సౌత్‌లో సూపర్ హిట్‌ అయిన 2018 చిత్రం
  • మలయాళంలో 80 కోట్లు.. మొత్తంగా 150 కోట్ల వసూలు
  • ఈ రోజు నుంచి సోనీ లివ్‌ లో స్ట్రీమింగ్
 2018 arrives on OTT earlier than the scheduled time

ఈ మధ్య సౌత్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘2018’. మలయాళంలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బలమైన కంటెంట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేసింది. పబ్లిక్ టాక్ తోనే సూపర్ హిట్ గా మారింది. ఆ తర్వాత తెలుగు సహా పలు భాషల్లో విడుదలైంది. 2018లో కేరళ రాష్ట్రంలో సంభవించిన విధ్వంసకర వరదల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మలయాళంలోనే 80 కోట్లు, మొత్తంగా 150 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టింది. తెలుగులో మే26న విడుదలైన ఈ చిత్రానికి టాలీవుడ్‌లోనూ మంచి స్పందన వచ్చింది. 

థియేటర్లలో ఉండగానే అనూహ్యంగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచి ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి రావడం ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నారాయణ్, తన్వి రామ్, జాయ్ మాథ్యూ తదితరులు నటించారు.

More Telugu News