ఇండియా - ఆస్ట్రేలియా మధ్య నేడే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్.. తుది జట్టులో వీళ్లు ఉండే అవకాశం!

ఇండియా - ఆస్ట్రేలియా మధ్య నేడే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్.. తుది జట్టులో వీళ్లు ఉండే అవకాశం!

WTC finals between India and Australia today
  • నేడు లండన్ లో ఫైనల్స్
  • బలంగా కనిపిస్తున్న భారత జట్టు
  • కీపర్ గా భరత్ కు ఛాన్స్ దక్కే అవకాశం
కాసేపట్లో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ ప్రారంభంకానుంది. లండన్ లోని ఓవల్ మైదానం ఈ తుది సమరానికి వేదిక కానుంది. మరోవైపు టీమిండియా జట్టు బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు పటిష్ఠంగా ఉన్నాయి. కీపర్ విషయంలో మాత్రం కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ ల మధ్య పోటీ ఉంది. అయితే, ఇండియాలో ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్దర్-గవాస్కర్ ట్రోఫీలో కేఎస్ భరత్ ఆడాడు. దీంతో, టీమ్ మేనేజ్ మెంట్ భరత్ వైపు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. 

టీమిండియా తుది జట్టులో రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ ఉండే అవకాశాలు ఉన్నారు. 

Advertisement
WTC
Team India
Australia
Team

More Telugu News