Sobhan Babu: అప్పట్లో శోభన్ బాబు ఇంటికి అద్దె 150 రూపాయలట!

Yechuri Interview
  • శోభన్ బాబు మద్రాసుకి ఫ్యామిలీతో వచ్చారన్న ఏచూరి
  • కృష్ణ సింగిల్ రూమ్ లో ఉండేవారని వెల్లడి 
  • ఇద్దరూ కలిసే సినిమా అవకాశాల కోసం తిరిగేవారంటూ వివరణ 
  • వాళ్లు కలిసి ఎదిగిన హీరోలంటూ వ్యాఖ్య
సౌత్ లోని సీనియర్ స్టార్ హీరోలలో శోభన్ బాబు అంతటి శ్రీమంతుడు మరొకరు లేరని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన తన లైఫ్ ను మలచుకున్న తీరు చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి శోభన్ బాబును గురించి ఆయన స్నేహితుడు .. సీనియర్ నటుడు ఏచూరి చలపతిరావు ప్రస్తావించారు. 

శోభన్ బాబు తన ఫ్యామిలీతో కలిసి మద్రాసు వచ్చారు. ఆయన ఒక చిన్న ఇంట్లో అద్దెకి ఉండేవారు. అప్పట్లో ఆ ఇంటికి అద్దె 150 రూపాయలు. కృష్ణ మాత్రం కమెడియన్ సారథితో కలిసి ఒక రూమ్ లో ఉండేవారు. ఒక రోజున కృష్ణను శోభన్ బాబుగారే నాకు పరిచయం చేశారు. హీరో అవుదామనే ఉద్దేశంతో ఆయన ఇండస్ట్రీకి వచ్చినట్టుగా చెప్పారు. 

శోభన్ బాబు - కృష్ణగారు మధ్య మంచి స్నేహం ఉండేది. ఇద్దరూ కలిసే సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. రేపటి రోజున ఎవరి ఆఫీసుకి వెళ్లాలనేది ముందురోజే మాట్లాడుకునేవారు. శోభన్ బాబు సైకిల్ పై అక్కడికి చేరుకుంటే .. కృష్ణగారు సిటీ బస్ పై అక్కడికి వెళ్లేవారు. అలా ఇద్దరూ కలిసే ఎదిగారు .. చివరివరకూ తమ స్నేహాన్ని కొనసాగించారు" అని చెప్పుకొచ్చారు. 

Sobhan Babu
Krishna
Tollywood

More Telugu News