Jharkhand: లోకో పైలట్ అప్రమత్తత.. తృటిలో తప్పిన రైలు ప్రమాదం

  • ఝార్ఖండ్‌లో వెలుగు చూసిన ఘటన
  • సంతాల్‌ధీ రైల్వే క్రాసింగ్ వద్ద గేటును ఢీకొట్టిన ట్రాక్టర్
  • అదే మార్గంలో వస్తున్న ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్
  • ట్రాక్టర్‌ను చూసిన వెంటనే బ్రేకులు వేసి రైలును ఆపేసిన లోకోపైలట్
  • ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ట్రాక్టర్ డ్రైవర్
Major train accident averted in jharkhand due to prompt response of locopilot

లోకోపైలట్ అప్రమత్తతతో మరో రైలు ప్రమాదం తృటిలో తప్పిపోయింది. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడుతున్న సమయంలో ఓ ట్రాక్టర్ దాన్ని ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్ రైలు బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఝార్ఖండ్‌లో సంతాల్‌ధీ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 

రైల్వే గేటును ట్రాక్టర్ ఢీకొనడాన్ని గమనించిన ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ వెంటనే బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు 45 నిమిషాలు పాటు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ట్రాక్టర్‌ను జప్తు చేసి కేసు నమోదు చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.

More Telugu News