amarnath yatra: అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా ఉగ్రదాడికి కుట్ర?

  • జులై 1 నుండి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
  • పాక్ కేంద్రంగా విధ్వంసాలకు పాల్పడే ఉగ్రవాదుల కుట్ర
  • దాడికి ఇద్దరు కశ్మీరీ యువకులకు బాధ్యతల అప్పగింత
  • అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ ఇద్దరి కోసం గాలింపు
Security agencies on alert as terror attack threat looms over Amarnath Yatra

జులై 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలని పాకిస్థాన్ కేంద్రంగా విధ్వంసాలకు పాల్పడే ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లుగా సమాచారం రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయని సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అమర్నాథ్ యాత్ర కాన్వాయ్, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరగవచ్చునని నిఘా వర్గాల నుండి సమాచారం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఇద్దరు కశ్మీరీ యువకులకు దాడి బాధ్యతలను అప్పగించారట.

రాజౌరీ - ఫూంచ్, పిర్ పంజాల్, చీనాబ్ వ్యాలీ తదితర ప్రాంతాల్లో ఉగ్రదాడికి అవకాశముందని అనుమానిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాడులకు పాల్పడుతారని భావిస్తున్న ఇద్దరు యువకుల గురించి గాలిస్తున్నారు. వారి ఇళ్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

More Telugu News