Chandrababu: కార్యకర్తల ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తోంది.. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం వస్తుంది: చంద్రబాబు

Chandrababu says TDP will win telangana in coming years
  • టీడీపీ అధికారంలో లేకపోయినా తెలంగాణ కార్యకర్తల ఉత్సాహం ముచ్చటేస్తోందన్న బాబు
  • టీడీపీ వచ్చాకే తెలుగు వారి ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పామని వ్యాఖ్య
  • ఎన్టీఆర్, పీవీలు దేశానికి దశ, దిశ చూపించారన్న టీడీపీ అధినేత
తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో లేకపోయినా తెలంగాణలో కార్యకర్తల ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తోందన్నారు. ఎన్టీఆర్, పీవీ నరసింహారావు దేశానికి దశ, దిశను చూపించారని, టీడీపీ వచ్చాకే తెలుగు వారి ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని చెబుతున్నారని, దానికి టీడీపీ వేసిన పునాది కారణమన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ప్రతి అడుగులో టీడీపీ ముద్ర ఉందన్నారు. అలాగే తెలుగు వాళ్లు ప్రపంచం నలుమూలలా ఉండటానికీ టీడీపీయే కారణమని చెప్పారు.

రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల కోసం టీడీపీ పని చేస్తుందని చెప్పారు. ప్రతి తెలుగు వాడిని సంపన్నుడిగా చేయాలన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మరోసారి తనను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఎన్నికైన తర్వాత తొలిసారి ఆయన హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు.
Chandrababu
Telangana
Telugudesam

More Telugu News