Karnataka: గేటు తీయడం ఆలస్యమైనందుకు టోల్ గేట్ ఉద్యోగి హత్య

Toll gate employee killed by four men over failure to open the gates in time
  • కర్ణాటక బిడది టోల్ గేట్ వద్ద ఆదివారం వెలుగు చూసిన ఘటన
  • గేట్ తీయడం ఆలస్యమైందంటూ ఇద్దరు సిబ్బందితో నిందితుల వాగ్వాదం
  • ఆ తరువాత సిబ్బంది భోజనానికి బయటకు రాగా హాకీ కర్రలతో దాడి
  • దాడిలో ఓ ఉద్యోగి అక్కడికక్కడే మరణించగా మరొకరికి తీవ్రగాయాలు
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు

గేటు తీయడం ఆలస్యమైనందుకు ఇద్దరు టోల్ గేట్ సిబ్బందిపై కొందరు దాడి చేయడంతో ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. కర్ణాటకలోకి బిడది పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 

ఆదివారం రాత్రి బిడది టోల్ గేట్‌లో పవన్, అతడి సహచరుడు విధులు నిర్వర్తిస్తుండగా మైసూరుకు వెళుతున్న నలుగురు వ్యక్తులు కారులో అక్కడకు వచ్చారు. ఆ తరువాత గేటు త్వరగా తీయాలంటూ వాగ్వాదానికి దిగారు. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో స్థానికులు ఇరు వర్గాలకు సర్దిచెప్పి పంపించారు. 

అనంతరం ఆ నలుగురు వ్యక్తులు తమ కారును టోల్‌గేట్‌కు కొద్ది దూరంలో నిలిపారు. ఈలోపు పవన్, అతడి సహోద్యోగి భోజనం చేసేందుకు బయటకు వచ్చారు. ఇది గమనించిన ఆ వ్యక్తులు వారిపై ఒక్కసారిగా దాడికి దిగారు. హాకీ కర్రలతో చితకబాదారు. ఈ ఘటనలో పవన్ ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News