రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడి దుర్మరణం.. మరో ముగ్గురికి గాయాలు
- కేరళలోని కైపమంగళం వద్ద ఈ తెల్లవారుజామున ప్రమాదం
- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
- సంతాపం తెలిపిన కేరళ సీఎం పినరయి విజయన్
సుధి మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. సుధి 2015లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ అయిన సుధి.. కొట్టప్పనయిలే రిత్విక్ రోషన్, కుట్టనదన్ మరప్పప్ప సహా పలు సినిమాల్లో నటించాడు. సుధి మృతివార్త తెలిసిన వెంటనే మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం అలముకుంది. ఆయన మృతికి పలువురు నటీనటులు సంతాపం తెలిపారు.