Tirumala: శ్రీవారి ఆలయం సమీపం నుంచి వెళ్లిన విమానం

Flight over tirumala temple no fly zone
  • ఆదివారం ఉదయం 8.00 సమయంలో వెలుగు చూసిన ఘటన
  • విమానం ఎక్కడిదనే దానిపై కొరవడిన స్పష్టత
  • ఘటనపై టీటీడీతో చర్చిస్తున్న విమానయాన శాఖ అధికారులు
ఆదివారం ఉదయం ఓ విమానం తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపం నుంచి వెళ్లింది. ఉదయం 8.00-8.30 గంటల మధ్యలో విమానం గుడి పక్క నుంచి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే, విమానం ఎక్కడి నుంచి బయలుదేరింది, గమ్యస్థానం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. 

ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం పైనుంచి విమానాలు వెళ్లడం నిషిద్ధం. అయితే, ఇటీవల విమానాలు ఆలయానికి సమీపం నుంచి వెళ్లిన ఘటనలు వెలుగు చూశాయి. ఇక తాజా ఘటనపై విమానయాన శాఖ అధికారులు టీటీడీ విజిలెన్స్ అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం.
Tirumala

More Telugu News