HERO: డీజీపీ, హైదరాబాద్ సీపీతో హీరో నిఖిల్ సిద్దార్థ బ్రేక్ ఫాస్ట్

Hero Nikhil breakfast with Telangana DGP and Hyderabad CP
  • తెలంగాణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా ఈ రోజు సురక్షా దినోత్సవం
  • ట్యాంక్ బండ్ పై కార్యక్రమానికి అతిథిగా హాజరైన నిఖిల్
  • నిఖల్ రావడం బాగుందన్న సీపీ సీవీ ఆనంద్
తెలంగాణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా ఈ రోజు  సురక్షా దినోత్సవం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో పోలీసు వాహనాల ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై జరిగిన కార్యక్రమంలో ద్విచక్ర వాహనాలు, డయల్ 100 పెట్రోలింగ్ వాహనాలతో ర్యాలీని హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ అంజనీ కుమార్ , హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్ సిద్దార్థ అతిథిగా హాజరయ్యారు. స్టేజ్ పై మాట్లాడిన ఆయన డీజీపీ, సీపీతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాడు. 

రియల్ హీరోలైన తెలంగాణ పోలీసుల కార్యక్రమానికి హాజరైనందుకు, డీజీపీ, సీపీతో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఆలోచనలు పంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ‘నిఖిల్ ఫంక్షన్‌కి రావడం చాలా బాగుంది. ఆయన హైదరాబాద్, తెలంగాణ పోలీసులకు స్నేహితుడు. నేను 12 సంవత్సరాల క్రితం ట్రాఫిక్ అడిషనల్ సీపీగా ఉన్నప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఆయన బ్రాండ్ ఐకాన్‌గా ఉన్నారు’ అని గుర్తు చేసుకున్నారు.
HERO
Nikhil siddartha
Telangana
TS DGP
Hyderabad CP
CV Anand

More Telugu News