Nara Lokesh: నేను చిటిక వేస్తే వాడు కనిపించేవాడు కాదు: నారా లోకేశ్

  • మైదుకూరులో యువగళం పాదయాత్ర
  • కోడిగుడ్డు ఘటన గురించి వివరించిన లోకేశ్
  • ప్రొద్దుటూరులో చూసింది ట్రైలర్ మాత్రమేనని వెల్లడి
  • అడ్డుకుంటామని వస్తే దబిడి దుబిడే అని వార్నింగ్
  • పసుపు సైన్యం పవర్ ఏంటో చూపిస్తామని వ్యాఖ్యలు
Lokesh comments in Mydukuru

ఎన్నికల సమయంలో జగన్ ఒక్క ఛాన్స్... ఒక్క ఛాన్స్... అన్నాడు, ఒక్క చాన్స్ ఇస్తే ఆయన పీకింది ఏంటి? రాష్ట్రాన్ని నాశనం చేసి ప్యాలస్ లో పడుకున్నాడు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. యువగళం పాదయాత్రలో భాగంగా... మైదుకూరు రాయలకూడలిలో నిర్వహించిన బహిరంగసభలో లోకేశ్ మాట్లాడుతూ... ప్యాలస్ పిల్లికి దమ్ము, ధైర్యం ఉంటే పరదాలు లేకుండా నాలా ప్రజల్లో తిరగాలి అంటూ సవాల్ విసిరారు.

పరదాలు లేకపోతే ప్యాలస్ పిల్లికి పులుసు కారిపోవడం ఖాయం అంటూ ఎద్దేవా చేశారు. ఒక్క రోజు పరదాలు లేకుండా వెళితే ప్యాలస్ పిల్లిపై ఏం పడతాయో గెస్ చెయ్యండి అంటూ సభకు వచ్చిన వారిని ప్రశ్నించారు. కోడిగుడ్లు, టొమాటోలు, చెత్త , చెదారం అన్నీ ప్యాలస్ పిల్లిపై పడతాయి... అందుకే పరదాల మద్య పర్యటించి పారిపోతాడని వ్యంగ్యం ప్రదర్శించారు. 

"ధైర్యంగా ఒక్క రోజు జనాల్లో తిరగలేని బ్రతుకు ప్యాలస్ పిల్లిది. నేను మరో సారి చెబుతున్నా సాగనిస్తే పాదయాత్ర... అడ్డుకుంటే దండయాత్ర. ప్రొద్దుటూరులో చూసింది ట్రైలర్ మాత్రమే నేను చిటికేస్తే గుడ్డు విసిరిన వాడు కనిపించే వాడు కాదు. నాకు మా నాన్న అంత ఓపిక అసలు లేదు. అడ్డుకుంటాం అంటూ ఎవడైనా వస్తే దబిడి దిబిడే" అంటూ బాలయ్య తరహాలో డైలాగ్ విసిరారు.

ఎదురొచ్చి నిలబడితే మా సత్తా చూపిస్తాం

కడప గడ్డపై యువగళం ప్రభంజనం చూసి ప్యాలస్ పిల్లికి నిద్ర పట్టడం లేదు. వైసీపీ పార్టీ గుర్తు మారింది. ఫ్యాన్ కాదు కోడి గుడ్డు. నాపై ప్యాలస్ పిల్లి కోడిగుడ్లు వేయించాడు. క్లైమోర్ మైన్లకే భయపడని ఫ్యామిలీ మాది, నీ తొక్కలో కోడి గుడ్డుకు భయపడతామా? కోడి గుడ్డు వేసిన సైకోగాళ్ళకి మనవాళ్లు మొహం మీద ఆమ్లెట్ వేసి పంపారు. సైకోస్ చీకట్లో కోడిగుడ్లు విసరడం కాదు దమ్ముంటే నేరుగా వచ్చి నిలబడండి. పసుపు సైన్యం పవర్ ఏంటో చూపిస్తాం. 

మైదుకూరు మాస్ జాతర అదిరిపోయింది. ఎంతో మహిమగల మాధవరాయుడు ఆలయం ఉన్న పుణ్య భూమి మైదుకూరు. పేరులోనే కాదు తెలివైన ప్రజలు ఉన్న ప్రాంతం మైదుకూరు. కాల జ్ఞానం రాసిన బ్రహ్మం గారు నడిచిన గొప్ప నేల మైదుకూరు. ఎంతో చరిత్ర ఉన్న ఆధ్యాతిక నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

కవితను బలి ఇస్తున్నాడనేది ఢిల్లీ టాక్!

జగన్ పాము కంటే ప్రమాదం... పాము తన పిల్లల్ని తానే తింటుంది. జగన్ కూడా పాము లాగే సొంత కుటుంబ సభ్యుల్ని, పార్టీ నాయకుల్ని కూడా మింగేస్తున్నాడు. సొంత బాబాయ్ వివేకా గారిని అత్యంత కిరాతకంగా జగన్, అవినాశ్ కలిసి చంపేశారు. ఏకంగా సొంత చెల్లే రహస్య సాక్షిగా మారింది. ఇప్పుడు ఆ కేసు నుండి బయటపడటానికి విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని బలి ఇచ్చాడు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం దెబ్బకి బాబాయ్ మర్డర్ కేసు వీక్ అయ్యింది. పోయిన ఎన్నికల్లో సాయం చేసిన కేసీఆర్ గారికి టోపీ పెట్టాడు జగన్. అవినాశ్ రెడ్డి, భారతి రెడ్డిని కాపాడటానికి కవిత గారిని బలి ఇస్తున్నాడు అనేది ఢిల్లీ టాక్. జగన్ ఆఖరికి బాబాయ్ మర్డర్ ని కూడా క్విడ్ ప్రో కోకి వాడుకున్నాడు.

కడప అభివృద్ధిపై బహిరంగ చర్చకు రండి!

జగన్ పదే పదే కడప బిడ్డని అంటాడు. పులివెందుల బస్ స్టాండ్ కట్టడానికి నాలుగేళ్లు పట్టింది. జిల్లాకి నువ్వు చేసింది ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పే దమ్ముందా? కడపకి ఏం చేశామో చెప్పే దమ్ము నాకుంది. ఏ సెంటర్ కి వస్తావో రా, కడపకు నువ్వు ఏంచేశావో మేం ఏం చేశామో చర్చించుకుందాం. 

నువ్వు కడప బిడ్డవి కాదు కడపకి పట్టిన శని. కడప జిల్లాకి నువ్వు ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నావా? ఎన్నికలకు ఆరు నెలల ముందు కొబ్బరికాయ కొడితే సినిమా అన్నావ్. నువ్వు కొబ్బరి కాయలు కొట్టి నాలుగేళ్లు అవుతుంది, నువ్వు పీకింది ఏంటి? కడప జిల్లాకి జగన్ చేసింది ఘరానా మోసం. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏం అయ్యింది? అన్నమయ్య బాధితులకు న్యాయం ఎప్పుడు చేస్తావ్? 

నేను వచ్చి నిలదీసిన తరువాత దున్నపోతు ప్రభుత్వం నిద్రలేచింది. నిన్న ఆదరాబాదరాగా గండికోట నిర్వాసితులకు న్యాయం చేస్తాం అంటూ అధికారులు హడావిడి మొదలుపెట్టారు. అది యువగళం పవర్. నాలుగేళ్లు పసుపు రైతుల వద్ద పసుపు కొనలేదు. ఇప్పుడు నేను జిల్లాలో తిరుగుతున్నాను అని హడావిడిగా పసుపు కొంటాం అంటూ బయలుదేరారు. 

జగన్ కు ఆ జబ్బు ఉంది!

జగన్ కి ఒక జబ్బు ఉంది. మైథోమానియా సిండ్రోమ్(mythomania syndrome) తో జగన్ బాధపడుతున్నాడు. ఈ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్ధాలు చెప్పడం ఈ జబ్బు లక్షణం. మైథోమానియా సిండ్రోమ్ వలనే జగన్ నేను పేదవాడ్ని అంటూ పదే పదే అబద్ధం చెబుతున్నాడు. 

లక్ష కోట్లు ఆస్తి ఉన్నా, లక్ష రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నా, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నా పేదవాడ్ని అంటూ అబద్ధం చెబుతాడు. మైథోమానియా సిండ్రోమ్ వలన జగన్ అబద్ధాలు చెబుతూ అబద్ధంలోనే బ్రతికేస్తాడు.

కబ్జా కింగ్ గా మారిన రఘురామిరెడ్డి

మైదుకూరు లో మ్యాజిక్ చేస్తారని రఘురామిరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించారు. మైదుకూరు ఏమైనా మారిందా? ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు. ఒక్క అభివృద్ది కార్యక్రమం జరగలేదు. ఆయన మైదుకూరుని భూకబ్జాలు, కమిషన్లు, ఇసుక దందాకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు. 

దువ్వూరు మండలం చింతకుంటలో సర్వే నెంబర్ 1396-2లో 80 ఎకరాల భూమిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి లేపేశారు. బాధితులు పాదయాత్రకు చేస్తుంటే పోలీసులు న్యాయం చేస్తామని నమ్మించి పాదయాత్ర ఆపేశారు. ఈ రోజు వరకూ వారికి న్యాయం జరగలేదు. కాజీపేట మండలంలో భీమటం, మైదుకూరు, చాపాడు మండలంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా భూములు కొట్టేయడానికి ఎమ్మెల్యే స్కెచ్ వేశారు.

*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1480.6 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 10.2 కి.మీ.*

*116 వరోజు పాదయాత్ర వివరాలు (4-6-2023)*

*మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):*

మధ్యాహ్నం

2.00 – భూమయ్యగారిపల్లి విడిది కేంద్రంలో బలిజలతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – భూమయ్యగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.05 – ఇంజనీర్ కొట్టాల వద్ద రైతులతో సమావేశం.

4.15 – పెద్దిరెడ్డి కొట్టాల వద్ద స్థానికులతో మాటామంతీ.

4.20 – బుడ్డయ్యపల్లిలో ఎస్సీలతో సమావేశం.

5.00 – ఖాజీపేట గాంధీసర్కిల్ లో స్థానికులతో మాటామంతీ.

5.15 – ఖాజీపేట అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.

5.20 – పాతూరులో స్థానికులతో సమావేశం.

6.25 – దుంపలగట్టు వద్ద స్థానికులతో సమావేశం.

6.45 – కొత్తపేటలో రైతులతో సమావేశం.

7.10 – కొత్తపేట బెరుం కాలేజి వద్ద పసుపు రైతులతో సమావేశం.

7.30 – చెన్నముక్కలపల్లి వద్ద స్థానికులతో సమావేశం.

7.55 – చెన్నముక్కలపల్లి శివారు విడిది కేంద్రంలో బస.

******


More Telugu News