Train Accident: ఒడిశా రైలు ప్రమాదం: 316 మంది ఏపీవాసులు సురక్షితం

316 Andhra Pradesh people safe in Odisha train accident
  • కోరమాండల్ లో ప్రయాణించిన 267 మందిలో 20 మందికి స్వల్ప గాయాలు
  • 113 మంది ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్లు తెలిపిన అధికారులు
  • హవ్‌డాలో ప్రయాణించిన 49 మంది సురక్షితం
  • 28 మంది ఫోన్ల స్విచ్చాఫ్
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనలో దాదాపు 300 మంది ప్రయాణికులు మృత్యవాత పడ్డారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్, హవ్‌డాలో 300 మందికి పైగా ఏపీ వాసులు ప్రయాణించారు. కోరమాండల్ లో ప్రయాణించిన 267 మందిలో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. 113 మంది ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్లు తెలిపారు. ఇక చివరి బోగీలు పట్టాలు తప్పిన హవ్ డా లో ప్రయాణించిన 49 మంది సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించారు. ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, 28 మంది ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా 316 మంది సురక్షితంగా బయటపడినట్లు చెప్పారు.

Train Accident
Odisha

More Telugu News