Keerthy Suresh: పెళ్లి గురించి అడిగితే ఘాటుగా స్పందించిన కీర్తి సురేశ్

  • కీర్తి పెళ్లి చేసుకోబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం
  • తన పెళ్లి గురించి అంత ఆసక్తి ఎందుకని ప్రశ్నించిన కీర్తి
  • పెళ్లి ఫిక్స్ అయితే తానే స్వయంగా చెపుతానని అసహనం
Keerthy suresh response on her marriage news

తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. టాలీవుడ్ లో తొలి సినిమా 'నేను శైలజ'తోనే ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది. మరోవైపు కీర్తి పెళ్లి చేసుకోబోతోందంటూ ఇటీవలి కాలంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాంటిది ఏమీ లేదని ఇప్పటికే కీర్తి, ఆమె కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. 

ఇక తాజాగా ఓ ప్రెస్ మీట్ లో కీర్తికి ఇదే ప్రశ్న ఎదురయింది. దీంతో ఆమె ఘాటుగా స్పందించింది. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చానని, అయినా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించింది. తన పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకని అడిగింది. ఈ అంశంపై ప్రతిసారి తనను అడగాల్సిన అవసరం లేదని... తన పెళ్లి ఫిక్స్ అయితే తానే స్వయంగా చెపుతానని అసహనం వ్యక్తం చేసింది.

More Telugu News