IPL 2023: క్రికెటర్ ధోనీ ఆస్తులు ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే!

  • ఒక అంచనా ప్రకారం రూ.1,040 కోట్ల సంపద పరుడు ధోనీ
  • గరుడ ఏరోస్పేస్, కార్స్ 24 తదితర కంపెనీల్లో పెట్టుబడులు
  • స్పోర్ట్స్ ఫ్రాంచైజీల్లో వాటాలు
  • ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్
IPL 2023 What Is CSK Captain MS Dhoni Net Worth

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఎన్నో ఏళ్లు గడిచిపోయినా ఝార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ (ఎంఎస్ ధోనీ) బ్రాండ్ విలువ ఏ మాత్రం తగ్గకపోగా, పెరుగుతూనే ఉంది. ఒకవైపు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ 42 ఏళ్ల వయసులోనూ క్రికెట్ లో ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకుంటూ.. మరోవైపు బ్రాండ్ విలువనే కాదు, తన సంపదను కూడా పెంచుకుంటున్నాడనే చెప్పాలి. భారత క్రికెటర్లలో విజయవంతమైన సారథిగా చరిత్రలో ఉండిపోతాడు. అంతేకాదు అత్యంత ధనవంతుడైన క్రికెటర్ కూడా అతడే. భారత్ లో అత్యంత విలువైన క్రీడాకారుడు. 

ఎంఎస్ ధోనీకి రూ.1,040 కోట్ల విలువైన ఆస్తులు ఉంటాయని అంచనా. చెన్నై జట్టు సారథిగా ఒక సీజన్ కు ధోనీ రూ.12 కోట్లు తీసుకుంటాడు. పలు స్టార్టప్ లు, కంపెనీల్లోనూ ధోనీకి పెట్టుబడులు ఉన్నాయి. ఖాతాబుక్, కార్స్24, శాకాహారి, గరుడ ఏరోస్పేస్ (డ్రోన్ల కంపెనీ)లో పెట్టుబడులు ఉన్నాయి. ఫిట్ నెస్, లైఫ్ స్టయిల్ బ్రాండ్ సెవెన్ లోనూ మెజారిటీ వాటాలున్నాయి. కోకకోలా, ఇండియా సిమెంట్స్, డ్రీమ్ 11, గోడాడీ, రీబాక్, స్వరాజ్ ట్రాక్టర్స్ ఇలా ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారంలో పాల్గొంటూ రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. 

అలాగే, ఫుట్ బాల్ జట్టు చెన్నియన్ ఎఫ్ సీ, హాకీ జట్టు రాంచీ రేస్, మహీ రేసింగ్ టీమ్ ఇండియా ఫ్రాంచైజీల్లోనూ ధోనీకి పెట్టుబడులు ఉన్నాయి. ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ సినిమా కోసం రూ.30 కోట్లు పుచ్చుకున్నాడు. ధోనీ ఆటగాడే కాదు, సిరిమంతుడని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

More Telugu News