Ukraine: జెలెన్ స్కీ ఇంటి ముందు నాటు నాటు సాంగ్ కు స్టెప్పులతో ఇరగదీసిన సైనికులు.. వీడియో ఇదిగో!

Ukraine Soldiers Dance To Naatu Naatu infront of zelensky official house
  • ప్రెసిడెంట్ అధికారిక నివాసం ముందే ఆర్ఆర్ఆర్ సాంగ్ చిత్రీకరణ
  • ప్రస్తుతం రష్యా దురాక్రమణతో చితికిపోయిన ఉక్రెయిన్
  • తోటి సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు నాటు నాటు డ్యాన్స్.. వీడియో వైరల్
ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న నాటు నాటు సాంగ్ గుర్తుందా.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ పాటను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ ఇంటిముందు చిత్రీకరించారు. ప్రస్తుతం అదేచోట అదే సాంగ్ కు ఉక్రెయిన్ సోల్జర్లు అవే స్టెప్పులు వేస్తూ తోటి సైనికులను ఉత్సాహపరిచారు. రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్ చితికిపోయింది. దేశంలో ఎక్కడ చూసినా బాంబు దాడుల ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. కొన్ని నగరాలు సమూలంగా నాశనమయ్యాయి. ఎప్పుడు ఎక్కడ బాంబుల వర్షం కురుస్తుందోనని జనం భయాందోళనల మధ్య బతుకుతున్నారు.

రష్యా దాడులను ఎదుర్కొంటూ, శత్రువులకు దీటుగా జవాబిస్తూ ఉక్రెయిన్ సైనికులలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పిట్టల్లా రాలిపోతున్న తోటి సైనికులను చూసి పోరాటంలో నిమగ్నమైన సోల్జర్లు నిరాశపడకుండా కొంతమంది సైనికులు నాటు నాటు సాంగ్ ను ఉపయోగించుకున్నారు. ఈ మాస్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు జోడించి వీడియో తీశారు. తమ ప్రెసిడెంట్ అధికారిక నివాసం ముందు యూనిఫాంలోనే డ్యాన్స్ చేశారు. రష్యాపై డ్రోన్ దాడి చేస్తున్నట్లు, ప్రత్యర్థికి సవాల్ విసురుతున్నట్లు అభినయిస్తూ సైన్యంలో ఉత్సాహం రేకెత్తించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వెంటనే వైరల్ గా మారింది.
Ukraine
Naatu Naatu
zelensky
oldiers Dance
Viral Videos

More Telugu News