Bhola Shankar: చిరంజీవి 'భోళాశంకర్' పాట ప్రోమో విడుదల

Song promo from Chiranjeevi Bhola Shankar

  • మెగాస్టార్ హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్
  • పాటల అప్ డేట్లు షురూ చేసిన చిత్రబృందం
  • తాజాగా చిన్న బిట్ తో సాంగ్ ప్రోమో
  • ఫుల్ లిరికల్ సాంగ్ జూన్ 4న విడుదల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళాశంకర్ నుంచి ఇక పాటల అప్ డేట్లు రానున్నాయి. చిరంజీవిపై చిత్రీకరించిన ఓ హుషారైన సాంగ్ కు సంబంధించిన ప్రోమోను చిత్రబృందం నేడు విడుదల చేసింది. 

సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ ఆర్కెస్ట్రయిజేషన్ చూస్తే పక్కా మాస్ బీట్ అని అర్థమవుతోంది. ఈ ప్రోమోలో చిన్న మ్యూజిక్ బిట్ ను మాత్రమే వదిలారు. దీనికి సంబంధించిన ఫుల్ లిరికల్ సాంగ్ ను జూన్ 4న విడుదల చేయనున్నారు. 

మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న భోళాశంకర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ కాగా... చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. 

మురళి శర్మ, రవిశంకర్, రఘుబాబు, వెన్నెల కిశోర్, తులసి, ఉత్తేజ్, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మి గౌతమ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

More Telugu News