Project K: ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డులను ‘ప్రాజెక్ట్-కె’ బ్రేక్‌ చేస్తుంది: రానా

rana daggubati says project k will break boundaries of baahubali and rrr

  • ‘ప్రాజెక్ట్ కె’ కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందన్న రానా
  • తెలుగు సినిమా గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందని వ్యాఖ్య
  • మంచి కథతో వచ్చిన సినిమాకు ఎక్కడైనా ఆదరణ దక్కుతుందని వెల్లడి

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్‌-కె’. భారీ తారాగణంతో, అత్యంత భారీ ఖర్చుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అందుకు దగ్గట్లుగానే ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, మేకింగ్ వీడియోలు.. ఆసక్తిని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో నటుడు రానా దగ్గుబాటి.. ‘ప్రాజెక్ట్-కె’పై ప్రశంసలు కురిపించాడు. 

ఓ జాతీయ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో రానా మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్‌ నటించిన ‘ప్రాజెక్ట్‌-కె’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది’’ అని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డులను ‘ప్రాజెక్ట్-కె’ బ్రేక్‌ చేస్తుందని చెప్పారు.

ఈ తెలుగు సినిమా గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందని అన్నారు. టాలీవుడ్‌లో ఒక హీరో సినిమాను మరొక హీరో సపోర్ట్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకుంటుంటారని, ఇది చాలా గొప్ప విషయమని రానా అన్నారు. ‘‘భారతీయ చిత్రాలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతిని ఎంతో గౌరవిస్తున్నాయి. అలాగే మంచి కథతో వచ్చిన సినిమాకు ఎక్కడైనా ఆదరణ దక్కుతుంది’’ అని చెప్పుకొచ్చారు.

వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ‘ప్రాజెక్ట్-కె’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకొణె తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో తమిళ స్టార్ కమలహాసన్‌ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Project K
Rana Daggubati
Nag Ashwin
Prabhas
Baahubali
RRR
Amitabh Bachchan
  • Loading...

More Telugu News