Jagan: ట్రాక్టర్ నడిపిన జగన్.. వీడియో ఇదిగో

  • వైఎస్సార్ యంత్ర సేవా పథకం మేళాను ప్రారంభించిన జగన్
  • 2,562 ట్రాక్టర్లను పంపిణీ చేసిన సీఎం
  • కార్యక్రమం సందర్భంగా ట్రాక్టర్ డ్రైవ్ చేసిన జగన్
Jagan drives tractor

వైఎస్సార్ యంత్ర సేవా పథకం రెండో విడత మెగా మేళాను ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను ఆయన పంపిణీ చేశారు. వీటి విలువ రూ. 361.29 కోట్లు. ఇదే సమయంలో 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా పంపిణీ చేశారు. మరోవైపు, ఈ కార్యక్రమం సందర్భంగా జగన్ ట్రాక్టర్ తోలారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే తన లక్ష్యమని చెప్పారు. రైతులు స్వావలంబన సాధించాలనేది తన ఆకాంక్ష అని అన్నారు. 

More Telugu News