Rana Daggubati: దగ్గుబాటి రానా నిర్మాతగా దుల్కర్ హీరోగా సినిమా

Rana Daggubati to produce Dulquer Salmaan  bilingual
  • రానాకు చెందిన స్పిరిట్ బ్యానర్ లో తెలుగు-తమిళ చిత్రం 
  • టాలీవుడ్ లో మంచి మార్కెట్ సంపాదించుకున్న దుల్కర్
  • చిత్రాన్ని తెరకెక్కించనున్న కొత్త దర్శకుడు
ప్యాన్ ఇండియా నటులుగా గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది నటులు దగ్గుబాటి రానా, దుల్కర్ సల్మాన్ చేతులు కలపనున్నారు. ఇద్దరూ కలిసి తెలుగు-తమిళ సినిమా చేయబోతున్నారు. ఇది మల్టీ స్టారర్ కాదు. ఈ చిత్రానికి రానా నిర్మాతగా వ్యవహరించనున్నారు. దుల్కర్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.  ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన ఆ తర్వాత ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాలతో టాలీవుడ్ లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. 

ఇటీవలే టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో తన కొత్త సినిమాను ప్రకటించారు. ఇప్పుడు రానా నిర్మాణంలోని ‘స్పిరిట్’ మీడియా బ్యానర్ లో మరోచిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్ సంస్థలో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఓ యువ సాంకేతిక నిపుణుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Rana Daggubati
Dulquer Salmaan
produce
Telugu
tamil
movie

More Telugu News